ETV Bharat / state

అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు శ్రమిస్తున్న చిన్న పార్టీలు - ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న షర్మిలా

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు... మిగతా పార్టీలు కూడా శ్రమిస్తున్నాయి. వామపక్షాలు, బీఎస్పీ, వైఎస్​ఆర్​టీపీ వంటి పార్టీలు.. ఓట్ల బరిలో సత్తా చాటి శాసనసభలో అడుగు పెట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఐపీఎస్ ప్రవీణ్​కుమార్​ నేతృత్వంలో బీఎస్పీ ఒంటరిగానే ఎన్నికల యుద్ధంలోకి దిగింది. ఇప్పటికే 63 మంది అభ్యర్థుల్ని ప్రకటించి.. ప్రచార పర్వంలో తన పని తాను చేసుకుంటూ పోతోంది. కాంగ్రెస్​తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై సీపీఐ, సీపీఎమ్ వేచి చూస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీతో చర్చలు విఫలం కావడంతో.. అన్ని చోటా పోటీ చేసేందుకు వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్​ఆర్​టీపీ పావులు కదుపుతోంది.

Telangana Elections
BSP in Telangana Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 3:24 PM IST

BSP in Telangana Elections తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న వామపక్షాలు, బీఎస్పీ, వైఎస్​ఆర్​టీపీ

Telangana Assembly Elections 2023 : బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఎన్నికల పోరులో హోరాహోరీగా తలపడుతుండగా... మిగతా పార్టీలు కూడా 'మేము సైతం' అంటూ ముందుకొస్తున్నాయి. ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్.. బహుజన సమాజ్​ పార్టీలో (BSP) చేరి.. ఆ పార్టీకి కొత్త ఊపు తెచ్చారు. బీఎస్పీ అధినేత్రి మయావతి... ఆర్​ఎస్​పీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బస్సుయాత్రతో జనంలోకి వెళ్లిన ఆయన... గ్రూప్​-1, పేపర్​ లీకేజీ, నిరుద్యోగ సమస్య సహా బీఆర్​ఎస్ (BRS) సర్కార్​ విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నారు. 35 లక్షల మంది నిరుద్యోగ యువత పక్షాన నిలబడి పోరాటం చేసిన ఫలితంగా కొన్ని పరీక్షలు రద్దు చేసింది సర్కారు. తొలుత కాంగ్రెస్​తో పొత్తు ఉంటుందని భావించినా... ఆ అంచనాను తలకిందలు చేస్తూ.. బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగింది.

BSP Candidates List : రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే రెండు విడతల్లో 63 మంది అభ్యర్థుల్ని ప్రకటించి.. మూడో జాబితా కోసం కసరత్తు చేస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఎస్‌పీ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్‌ చిత్రపు పుష్ఫిత లయ పేరు ఖరారు చేసి ప్రకటించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీ, ఎస్సీ-ఎస్టీ, మైనార్టీ ఓట్లపై బీఎస్పీ దృష్టి పెట్టింది. సిర్పూర్​ కాగజ్​ నియోజకవర్గం నుంచి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. తాను స్థానికేతరుడిని అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే కొనేరు కొనప్ప చేసిన విమర్శలకు స్పందించిన ప్రవీణ్​... కాగజ్​నగర్​లో స్వంత ఇల్లు కొనుగోలు చేశారు. తాను పుట్టింది ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్లోనైనా... మరణించేది మాత్రం సిర్పూర్ గడ్డపైనేనని ప్రకటించిన ఆర్​ఎస్పీ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు.

BSP Telangana Election Campaign 2023 : హైదరాబాద్ వేదికగా ఎన్నికల సమర శంఖారావం పూరించిన బీఎస్పీ

వామపక్షాలు... కాంగ్రెస్​తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై వేచి చూస్తున్నాయి. కాంగ్రెస్ ఒకవేళ చెయ్యిస్తే... ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సీపీఐ, సీపీఎమ్ సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం నినాదంతో షర్మిల నేతృత్వంలో వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ తెరపైకి వచ్చింది. మూడువేల కిలో మీటర్లకుపైగా పాదయాత్ర చేసిన షర్మిల... ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్​ రెడ్డి అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

RS PraveenKumar Fires on Telangana Government :'రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోంది'

అయితే.. ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉందనే భావనతో... పార్టీని కాంగ్రెస్​లో విలీనం చేయాలని షర్మిల చర్చలు జరిపారు. అయితే... ఇందుకు రేవంత్​ రెడ్డి సహా కాంగ్రెస్​లోని ఓ వర్గం గట్టిగా అడ్డుపడటంతో... ఆ పార్టీ అధిష్ఠానం వెనక్కి తగ్గిందని సమాచారం. హాస్తం పార్టీతో చర్చలు విఫలం కావడంతో నొచ్చుకున్న షర్మిల... ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించారు. తొలుత ప్రకటించిన విధంగానే తాను ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే... ఇప్పటివరకు షర్మిల పార్టీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాలేదు.

Mayawati Hyderabad Tour : హైదరాబాద్‌ చేరుకున్న మాయావతి.. నేతల ఘనస్వాగతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.