Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. గెలుపు కోసం పార్టీలు, అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హైదరాబాద్‌లో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నాంపల్లి అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు మద్దతుగా పతంగి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్వాన్ నియోజకవర్గ మజ్లిస్ అభ్యర్థి కౌశల్ మొయినుద్దీన్ ప్రచారంలో జోరు పెంచారు.
Door to Door Election Campaign : ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజును గెలిపించాలని.. ఆయన సతీమణి లావణ్య ఇంటింటికి కరపత్రాలు పంచారు. ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ బషీర్‌బాగ్, చందానగర్ బస్తీలో ప్రచారం నిర్వహించారు. తొమ్మిదిన్నరేళ్ల అభివృద్ధిని వివరిస్తూ.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎల్బీనగర్‌లో ప్రచారం చేసిన బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి ప్రజలు డప్పు చప్పుల్లతో స్వాగతం పలికారు.
కూకట్‌పల్లిలోని అల్లాపూర్ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేశ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి ప్రజలు బోనాలతో స్వాగతం పలికారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు.. చిలకలగూడలోని మసీదు వద్ద ముస్లిం ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఖైరతాబాద్‌లోని పలు కాలనీల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Election Campaign along with Families : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో తుంగతుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ గెలుపును కాంక్షిస్తూ.. ఆయన సతీమణి పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ.. కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు కోరుట్లలో ప్రచారం చేశారు. కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్.. నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఊరూ వాడా తిరిగుతూ ప్రచారం నిర్వహించారు.
పోటాపోటీగా ఎన్నికల ప్రచారం : సిద్దిపేట జిల్లా కోహెడలో ప్రచారం చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌కు ప్రజలు ఆటపాటలతో స్వాగతం పలికారు. నాగార్జున సాగర్ ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి జైవీర్‌కు పార్టీ శ్రేణులు గజ మాలతో స్వాగతం పలికారు. ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీతకు మద్దతుగా.. డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మిర్యాలగూడలో సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ప్రచార జోరు పెంచారు. పెద్దపెల్లి జిల్లా మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
BRS vs Congress on Telangana Elections 2023 : కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ప్రచార జోరు పెంచారు. హనుమకొండ జిల్లా నడికుడ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి గ్రామ ప్రజలు డప్పు చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. గజ్వేల్‌లో కేసీఆర్‌కి మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు
నిర్మల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మంజూలాపూర్, వెంకటాపుర్, శాంతి నగర్ వార్డుల్లో ప్రచారం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. హాన్మజిపేట, కోనాపూర్, సంగోజిపేట్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బీజేపీ అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు.
హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు