ETV Bharat / state

సచివాలయం, జీహెచ్​ఎంసీ కార్యాలయంలో కరోనా కలకలం

corona
corona
author img

By

Published : Jun 8, 2020, 12:01 PM IST

Updated : Jun 8, 2020, 12:42 PM IST

11:58 June 08

సచివాలయంలో కరోనా కలకలం

సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్​లో కరోనా కలకలం రేగింది. ఏడో అంతస్తులో ఆర్థికశాఖలో విధులు నిర్వర్తిస్తోన్న ఓ పొరుగుసేవల సిబ్బందికి పాజిటివ్ వచ్చిందన్న సమాచారం నేపథ్యంలో అధికారులు, సిబ్బంది హోంక్వారంటైన్​లోకి వెళ్లారు.  

కొన్నాళ్ల క్రితం తమ బంధువుల్లో ఒకరి అంత్యక్రియలకు సదరు ఉద్యోగి హాజరయ్యారు. అతణ్ని కొంతకాలం విధులకు హాజరు కానివ్వలేదు. తాజాగా కరోనా పాజిటివ్ నేపథ్యంలో ఆ అంతస్తులో ఆర్థికశాఖ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హోంక్వారంటైన్​లోకి వెళ్లారు.  

ఎనిమిదో అంతస్తులోనూ ఆర్థికశాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, సిబ్బంది ఇవాళ విధులకు హాజరు కాలేదు. కొందరు విధులకు వచ్చి మళ్లీ ఇళ్లకు తిరిగివెళ్లారు. 

జీహెచ్​ఎంసీ భవన్​లోనూ

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగికి కరోనా సోకింది. 4వ అంతస్తులో ఓ సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగికి కరోనా నిర్ధరణ అయింది. ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధరణతో అధికారులు అప్రమత్తమయ్యారు. 4వ అంతస్తులో పనిచేస్తున్న ఉద్యోగులను ఇళ్లకు పంపించారు. 4వ అంతస్తులో శానిటైజేషన్ చేయిస్తున్నారు. 

Last Updated : Jun 8, 2020, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.