ETV Bharat / state

బడ్జెట్​కు సీఎం ఆమోదం.. అన్ని వర్గాలకూ సానుకూలంగా పద్దు - తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

బడ్జెట్ పద్దు సిద్ధమైంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం పొందింది. ప్రాధాన్యతా పథకాలకు కేటాయింపులు కొనసాగింపుతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా నిధులు సమకూర్చనున్నారు. 2020-21 వార్షిక బడ్జెట్​ అన్ని వర్గాలకు పూర్తి సానుకూలంగా, వాస్తవికంగా ఉంటుందని సీఎం కేసీఆర్​.. గవర్నర్​కు తెలిపారు. నిన్న రాజ్​భవన్​లో ఆయన తమిళి సైతో భేటీ అయ్యారు.

బడ్జెట్​కు సీఎం ఆమోదం.. అన్ని వర్గాలకూ సానుకూలంగా పద్దు

author img

By

Published : Mar 5, 2020, 5:13 AM IST

Updated : Mar 5, 2020, 9:40 AM IST

తెలంగాణలో 2020-21 వార్షిక బడ్జెట్​ అన్ని వర్గాలకు పూర్తి సానుకూలంగా, వాస్తవికంగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ గవర్నర్​ తమిళి సైకు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాజ్​భవన్​లో ఆయన గవర్నర్​తో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు ఆమెను ఆహ్వానించారు. మంత్రిమండలి ఆమోదించిన గవర్నర్ ప్రసంగ ప్రతిని.. తమిళిసైకి అందించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ప్రత్యేకించి కరోనా వైరస్ నియంత్రణా చర్యలు, ముందుజాగ్రత్త చర్యలను గవర్నర్​కు ముఖ్యమంత్రి వివరించారు.

బడ్జెట్​కు ఆమోద ముద్ర:

బడ్జెట్ పద్దులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆమోద ముద్ర వేశారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, అధికారులతో సీఎం ప్రగతి భవన్​లో సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా పథకాలకు నిధుల కేటాయింపు విషయాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ పద్దుపై విస్తృతంగా చర్చించారు. రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలకు కేటాయింపులతో పాటు రుణమాఫీ అమలు దిశగా చర్యలు, అందుకు సంబంధించి బడ్జెట్​లో నిధులు పొందుపరచడం, తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారు.

మంత్రివర్గ సమావేశం:

ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్... బడ్జెట్​కు తుది మెరుగులు దిద్దారు. 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్​కు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర మంత్రివర్గం త్వరలోనే సమావేశమై బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఈనెల 8న రాష్ట్ర వార్షిక బడ్జెట్​ను ఉభయసభల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది.

బడ్జెట్​కు సీఎం ఆమోదం.. అన్ని వర్గాలకూ సానుకూలంగా పద్దు

ఇవీ చూడండి: కరోనా లేని రాష్ట్రంగా మారుస్తాం: ఈటల

Last Updated : Mar 5, 2020, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.