ETV Bharat / state

కరోనా గందరగోళం: ముందు పాజిటివ్​.. తర్వాత నెగెటివ్​.. - నెల్లూరులో కరోనా కేసులు 34 న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరులో ఓ వ్యక్తికి కరోనా పరీక్షల్లో గందరగోళం నెలకొంది. మెుదట పాజిటివ్ రాగా.. అదేరోజు మళ్లీ నెగెటివ్ వచ్చింది.

technical-error-in-corona-testing-nellore
కరోనా గందరగోళం: మందు పాజిటివ్​.. తర్వాత నెగెటివ్​
author img

By

Published : Apr 5, 2020, 12:55 PM IST

Updated : Apr 5, 2020, 3:58 PM IST

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించి ఈనెల 3వ తేదీన కరోనా పరీక్ష నిర్వహంచారు. ముందుగా పాజిటివ్‌ అని రాగా.. అదే రోజు మళ్లీ చేసిన పరీక్షలో నెగెటివ్‌ అని వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన నివేదికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి చోటు చేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అదనపు ఆర్‌ఎంవో డాక్టర్‌ కనకాద్రిని వివరణ కోరగా.. ఆ వ్యక్తికి నెగెటివ్‌ అని తెలిపారు.

టెక్నికల్‌ ఎర్రర్‌ కారణంగా మొదట పాజిటివ్‌గా నమోదైందని, వెంటనే మళ్లీ దానిని నిర్ధారించగా నెగెటివ్‌గా వచ్చిందని.. నివేదిక పంపారని కనకాద్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం

Last Updated : Apr 5, 2020, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.