Teaching Doctors Protest: రాష్ట్రంలో పూర్తి స్థాయి డీఎంఈ పదవిని సృష్టించి కొత్తవారిని ఆ స్థానంలోకి నియమించాలని తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల అసోసియేషన్ డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం ఎదుట అసోసియేషన్ సభ్యులు నిరసనకు దిగారు.
చాలా ఏళ్లుగా మా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. డీఎంఈ పోస్టు ఇప్పటివరకు క్రియేట్ చేయకుండా మా డీఎంఈ అడ్డుకున్నారు. మాకు ఇంతవరకు పీఆర్సీ సమస్యలు పరిష్కరించలేదు. చాలా మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది. ఈ డీఎంఈ మాకు వద్దు. రెండు వేల మంది ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఐదేళ్లుగా డీఎంఈ పోస్టులో ఉంటూ ప్రశ్నించిన ఉద్యోగులను వేధిస్తున్నారు. - డాక్టర్ జలగం తిరుపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల అసోసియేషన్
ప్రధానంగా ఐదు డిమాండ్లతో గత రెండు రోజులుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న వైద్యులు ఇవాళ డీఎంఈ కార్యాలయం వద్ద నిరనస చేపట్టారు. డీఎంఈ రమేష్ రెడ్డిని తొలగించాలంటూ తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జలగం తిరుపతి రావు డిమాండ్ చేశారు. డీఎంఈకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అలాగే 56 నెలల పీఆర్సీ చెల్లించాలని.. సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ఎన్క్యాష్మెంట్, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీంను అమలు చేయాలని కోరారు. ఈ మేరకు 17 మెడికల్ కాలేజీల ప్రతినిధులు కోఠిలో ఆందోళన చేపట్టారు.
ఇవీ చదవండి: భాజపా నాయకులతో రాజగోపాల్రెడ్డి సంప్రదింపులు... అనివార్యం కానున్న ఉపఎన్నిక
'ఇక మీరే చూసుకోండి!'.. జిల్లా కలెక్టర్ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!