పీఆర్సీ అమలు.. ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీ వద్దకు వెళ్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట, గోషామహల్ పోలీస్స్టేషన్లకు తరలించారు.
అరెస్టు క్రమంలో ఉద్యోగుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తించారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపించారు. పోలీసులకు, ఉద్యోగులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులు గాయపడ్డారు.