ETV Bharat / state

విజయవాడను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా..

author img

By

Published : Mar 5, 2021, 3:43 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని.. తెదేపా మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో రెండుసార్లు పాదయాత్ర చేశానని ఇక్కడి సమస్యలు వాటి పరిష్కార మార్గాలు తనకు తెలుసని అన్నారు. విద్యార్థి నేతగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని.. ఏడేళ్లుగా పార్టీకి తనవంతు సేవలందిస్తున్నానని.. ఇవే మేయర్‌ అభ్యర్థిగా తనను ప్రకటించేందుకు ఉన్న అర్హతలంటున్న కేశినేని శ్వేతతో స్పెషల్ చిట్ చాట్...

tdp-mayor-candidate-kesineni-swetha-special-interview
విజయవాడను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా..

వ్యక్తిగత వివరాలు..

  • పూర్తిపేరు: కేశినేని శ్వేతా చౌదరి
  • వయసు: 24 ఏళ్లు, అవివాహిత
  • తండ్రి: కేశినేని శ్రీనివాస్‌(నాని)
  • తల్లి : పావని, సోదరి: హైమ

ఏపీ విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేతను తెలుగుదేశం పార్టీ గురువారం ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తెగా శ్వేత ఇప్పటికే నగరవాసులకు సుపరిచితురాలు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్‌ నుంచి ప్రస్తుతం కార్పొరేటర్‌ అభ్యర్థిగా శ్వేత బరిలోనికి దిగారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన శ్వేత గత రెండేళ్లుగా నగరంపై దృషి ్టసారించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీరు, రహదారులు, భూగర్భ డ్రైనేజీ, దోమల సమస్య.. ఇలా అన్నింటిపైనా దృష్టి పెట్టారు. నగరంలోని కొండ ప్రాంతాల్లోని పేదల ఇబ్బందులు, భవన నిర్మాణ, రవాణా రంగ కార్మికుల ఆర్థిక స్థితిగతులు, బీసెంట్‌ రోడ్డు, వన్‌టౌన్‌, ఆటోనగర్‌లో పనిచేసే చిరుద్యోగుల అవసరాలను తెలుసుకున్నారు. వీరందరికీ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం, నగరపాలక సంస్థ దృష్టికి తీసుకెళ్లేందుకు.. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి నివేదికను రూపొందించారు.

ఉన్నత విద్యావంతురాలు.. కేశినేని శ్వేత విజయవాడలోని అట్కిన్‌సన్‌, వి.పి.సిద్ధార్థ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. బెంగళూరులో ఇంటర్‌ చదివారు. అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరి విశ్వవిద్యాలయంలో బీఏ సైకాలజీ, బీఏ ఎకనమిక్స్‌ పూర్తి చేశారు.

విదేశాల్లో పనిచేసి.. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆఫ్రికాలోని ఘనా దేశంలో మైక్రో ఫైనాన్స్‌ కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌లో కొంతకాలం పనిచేశారు. ఐర్లాండ్‌లోని గాల్వే నగరంలో చైల్డ్‌ సైకాలజీ ప్రోగ్రామ్‌లో కొనసాగారు. టాటా ట్రస్టు తరఫున మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత టాటా ట్రస్టు క్యాన్సర్‌ కేర్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, అసోం, ఒడిశా, రాజస్థాన్‌లో పని చేశారు.

రాజకీయ నేపథ్యం.. అట్లాంటా సెనేటర్‌ ఎన్నికలకు 2014లో ప్రచార బాధ్యతలు చేపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ తరఫున 2016లో ప్రచారం చేశారు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం 2014, 2019ల్లో ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు.

జెండాను ఎగరేస్తాం

విజయవాడలోని తెదేపా కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి వేడుకలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేశినేని శ్వేత మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా భారీ మెజార్టీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో మళ్లీ తెదేపా జెండా ఎగురవేసి తీరుతామన్నారు. విజయవాడ నగరాన్ని అభివృధ్ధి చేసి, అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు నగరంలోని తాగునీరు, డ్రైనేజీ సమస్యలను తెదేపా 80శాతం పూర్తి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో కనీసం ఒక్క శాతం కూడా పూర్తి చేయకుండా.. అర్ధంతరంగా పనులు నిలిపేశారన్నారు.

ఇదీ చదవండి: బాసరకు వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.