ETV Bharat / state

గుడివాడ క్యాసినో వ్యవహారం.. ఐటీ శాఖకు ఆధారాలు ఇవ్వనున్న టీడీపీ నేతలు - AP Latest News

Gudivada Casino Case Updates: ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో.. గత సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో నిర్వహించిన క్యాసినో వ్యవహారం వివాదాస్పదమైంది. టీడీపీ నేతల చేసిన ఆరోపణలకు స్పందించిన ఐటీ శాఖ అధికారులు.. తగిన ఆధారాలను అందజేయాలని వారికి ఆదేశాలు జారీ చేసింది.

Gudivada Casino Case Updates
Gudivada Casino Case Updates
author img

By

Published : Dec 19, 2022, 12:02 PM IST

Gudivada Casino Case Updates: ఆంధ్రప్రదేశ్​లోని గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నేతలు ఐటీ శాఖ అధికారులను కలిసి సాక్ష్యాలు అందజేయనున్నారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినో వివాదాస్పదమైంది. అప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొడాలినాని, గన్నవరం ఎమ్మెల్యే వంశీలు.. క్యాసినో నిర్వహణ ద్వారా వందల కోట్ల నల్లధనం చేతులు మార్చారని టీడీపీ ఆరోపించింది.

దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ.. సమాచారం సేకరణలో భాగంగా విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయానికి రావాలని టీడీపీ నేతలను కోరింది. ఇందులో భాగంగానే ఆ శాఖ కార్యాలయానికి వర్ల రామయ్య, బొండా ఉమ తదితర నేతలు వెళ్లి.. అధికారులకు సమాచారం ఇవ్వనున్నారు.

గుడివాడ క్యాసినో వ్యవహారం.. ఐటీ శాఖకు ఆధారాలు ఇవ్వనున్న టీడీపీ నేతలు

ఇవీ చదవండి: ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పీఏ శ్రవణ్‌

కొత్త ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. మోదీతో భేటీ కావాల్సి ఉండగా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.