ETV Bharat / state

'ఉమామహేశ్వరి మరణంపై వైకాపా దుష్ప్రచారం దారుణం' - తెదేపా నేతల ఆగ్రహం

TDP LEADERS: ఎన్టీఆర్​ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి మరణంపై వైకాపా దుష్ప్రచారం దారుణమని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో అసత్య ఆరోపణలతో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏపీ వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

tdp
tdp
author img

By

Published : Aug 4, 2022, 8:33 PM IST

Tdp fire on YSRCP about NTR's daughter: వైకాపా నేతలకు దమ్ముంటే ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ చేయించుకోవాలని.. తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి అంశంపైనా నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ గుర్రంపాటి దేవేందర్‌రెడ్డిపై విశాఖ సీపీ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆధ్వర్యంలో విశాఖ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.

ఉమామహేశ్వరి మృతిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలంటూ.. గుడివాడ, గుంటూరు, అనంతరం, తిరుపతి, కళ్యాణదుర్గంలో తెలుగుదేశం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదనపల్లెలో తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు సారథ్యంలో.. ఆందోళనలు చేపట్టారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.