ETV Bharat / state

నారా లోకేశ్‌కు ప్రాణ హాని తలపెట్టే కుట్రలు: గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు - నేటి తాజా వార్తలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలో​ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర భద్రతా లోపాలపై పార్టీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్​ను కలిశారు. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిసిన నేతలు పోలీసులు సృష్టిస్తున్న అడ్డంకులను, వైసీపీ నాయకుల తీరును గవర్నర్​కు వివరించారు.

నారా లోకేశ్‌కు ప్రాణ హాని తలపెట్టే కుట్రలు: గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

author img

By

Published : Feb 11, 2023, 5:19 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న​ యువగళం పాదయాత్రలో ప్రాణహాని తలపెట్టే కుట్రలను వైసీపీ పన్నుతోందని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, బోండా ఉమా, వర్ల రామయ్యలు రాజ్​భవన్​లో గవర్నర్​ను కలిశారు. నిఘా ముసుగులో పోలీసులు డ్రోన్ల ద్వారా లోకేశ్‌ లేని చోట చిత్రీకరిస్తున్న దృశ్యాలను గవర్నర్​కు అందించారు. నారా లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గవర్నర్​కు విన్నవించారు.

ఈ సమస్యలపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు అవకాశం రానందున.. డీజీపీని కలిసే అవకాశం కల్పించమని గవర్నర్​ను కోరారు. పోలీసులు అడుగడుగునా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించటం, ప్రజలతో మాట్లాడకుండా మైక్ నియంత్రించడం, కేసుల నమోదు, వాహనాలు సీజ్ వంటి పరిణామాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 20సార్లు ఫిర్యాదు చేశామని.. న్యాయం జరగలేదని గవర్నర్​కు వివరించారు. లోకేశ్​కు ప్రాణహాని ఉందని గవర్నర్​కు తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుని ఆధ్వర్యంలో వైసీపీ సోషల్​ మీడియా పని చేస్తోందని.. పోలీసులే డ్రోన్ల ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను అతనికి పంపుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటి ద్వారా భద్రతా లోపాలు ఉన్న ప్రదేశాలను తెలుసుకుని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.

ఈ సందర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ.. వైసీపీ పోలీసుల గుండాలతో యువగళం పాదయాత్రని అణగదొక్కే తీరును గవర్నర్​కు సమగ్రంగా నివేదించామన్నారు. లోకేశ్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు డీఐజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా తాడేపల్లి ప్యాలెస్ నియమించిందని, ఆయన అక్రమాల చిట్టా అంతా తమ వద్ద ఉందని అన్నారు. త్వరలోనే దానిని బయటపెడతామన్నారు. తాడేపల్లి పెద్దలు చెప్పినంత మాత్రాన పోలీసులకు మాపై చేయి చేసుకునే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. తమ సహనాన్ని పోలీసులు పరీక్షించవద్దని అన్నారు. పోలీసుల దుశ్చర్యల గురించి గవర్నర్​కు పూర్తిగా వివరించామని అన్నారు.

"లోకేశ్​ చేపట్టిన పాదయాత్రలో స్వయంగా తాడేపల్లి నిబంధనలు పాటిస్తూ.. డీఐజీ కొల్లు రఘురామరెడ్డి వెనకాల కారులో ఉండి, అక్కడ ఉన్న పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరి ఇతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఆయనే ఆలోచించుకోవాలి." -బోండా ఉమా, టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యులు

"యువతలో చైతన్యం వచ్చిందని పాదయాత్రను ఏదో విధంగా పోలీసులు అడ్డుకునేందుకు కుట్ర జరుపుతున్నారు. వారు పాదయాత్రను అడ్డుకునేందుకు చేయని కుట్ర లేదు. ఇందులో ప్రధానంగా లోకేశ్​ భద్రతకు ప్రమాదం ఉందని భావిస్తున్నాం. ఎక్కడ అడ్డుకోవచ్చు, ఎక్కడ ఏం అల్లరి సృష్టించటానికి ఆస్కారం ఉందనే అలోచనలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కుట్ర జరుగుతోంది."-నక్క ఆనంద్​బాబు, మాజీ మంత్రి

నారా లోకేశ్‌కు ప్రాణ హాని తలపెట్టే కుట్రలు: గవర్నర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.