ETV Bharat / state

తెదేపా 'చలో కంతేరు'... పోలీసుల మోహరింపు.. నేతల గృహనిర్బంధం - గుంటూరు జిల్లా తాజా వార్తలు

TDP HOUSE ARREST: వెంకాయమ్మపై దాడిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చలో కంతేరుకు పిలుపునివ్వగా.. నేతలను నిర్బంధిస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తెదేపా నాయకులను గృహ నిర్బంధం చేశారు. పోలీసులు తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చలో కంతేరు
చలో కంతేరు
author img

By

Published : Jun 13, 2022, 1:17 PM IST

TDP HOUSE ARREST: ఏపీ గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో తెదేపా సానుభూతిపరురాలైన వెంకాయమ్మపై వైకాపా కార్యకర్తల దాడిని నిరసిస్తూ.. ఆ పార్టీ చలో కంతేరుకు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా సిబ్బందిని మోహరించారు. తాడికొండ, కంతేరులో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబును గృహనిర్బంధం చేశారు. బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు తీరును తప్పుబట్టిన ఆయన ఎలాగైనా కంతేరు వెళ్తామన్నారు.

తాడేపల్లిలో తెదేపా నేత తెనాలి శ్రావణ్ కుమార్​ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అనుమతి లేకుండా బయటికి వెళ్లరాదంటూ సీఐ శ్రావణ్ ఆయనకు తేల్చి చెప్పారు. పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే అడ్డుకోవడానికి మీరు ఎవరని పోలీసులను శ్రావణ్ కుమార్​ ప్రశ్నించారు. కార్యాలయానికి పోవడం తన హక్కు అన్నారు. కంతేరు వెళ్లకుండా కృష్ణా-గుంటూరు జిల్లా తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహానిర్భంధం చేస్తున్నారు. విజయవాడలో దేవినేని ఉమా, నందిగామలో తంగిరాల సౌమ్యలను గృహ నిర్బంధం చేసారు.

కంతేరులోనూ పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామానికి వచ్చే అన్ని మార్గాలను ప్రత్యేక బలగాలను మోహరించారు. గ్రామాలకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. గ్రామంలోనూ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వందల మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. తుళ్లూరు డీఎస్పీ పోతురాజు ఆధ్వర్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వెంకాయమ్మ ఇంటి చుట్టూ 30 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ద్విచక్రవాహనాలపై తిరుగుతూ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

"ప్రజాస్వామ్యయుతంగా కంతేరు వెళ్లడానికి మా పార్టీ ఇచ్చిన పిలుపును అడ్డగోలుగా అడ్డుకుంటున్నారు. వెంకాయ్యమకు రక్షణ ఇస్తారనే నమ్మకం లేదు. మాకు భయం ఉంది. ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది.కంతేరు వెళ్లకుండా ముఖ్యనేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఆమెకు ఏమీ జరిగినా పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది."-నక్కా ఆనంద్‌బాబు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

తెదేపా 'చలో కంతేరు'... పోలీసుల మోహరింపు.. నేతలు గృహనిర్బంధం

ఇదీ చదవండి: కాంగ్రెస్​ ర్యాలీకి పోలీసుల గ్రీన్‌సిగ్నల్‌.. భాగ్యనగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్.. నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.