ETV Bharat / state

జగన్​లో ఓటమి భయం కనిపిస్తోంది: యనమల - ap govt

YANAMALA FIRES ON CM JAGAN: సీఎం జగన్‌కు ఈసారి ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్నీ ఇన్నీ కావన్న ఆయన.. ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారు. చంద్రబాబు, పవన్ భేటీకి జగన్ అనుమతి తీసుకోవాలా..? అని యనమల ప్రశ్నించారు.

జగన్ లో ఓటమి భయం
జగన్ లో ఓటమి భయం
author img

By

Published : Jan 10, 2023, 3:48 PM IST

YANAMALA FIRES ON CM JAGAN : జగన్ క్రిమినల్ కాబట్టి కలవడానికి ఎవరైనా భయపడతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు విమర్శించారు. చంద్రబాబు, పవన్ సమావేశం కావాలనుకుంటే జగన్ అనుమతి తీసుకోవాలా..? అని నిలదీశారు. చంద్రబాబు, పవన్ భేటీతో ఓడిపోతామనే భావనలోకి సీఎం జగన్ వెళ్లారని ఎద్దేవా చేశారు. జగన్.. మోదీ, అమిత్ షాను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఉన్న పార్టీతోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు నాయకత్వం కోసం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.

సీఎం జగన్‌కు ఈ సారి ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని యనమల అన్నారు. వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలు అన్నీ ఇన్నీ కావన్న ఆయన.. ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్నారు. పొత్తులు అనేది ఎన్నికల సమయంలో తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటే.. ప్రాంతీయ పార్టీలు పెట్టుకోకూడదా..? అంటూ యనమల నిలదీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.