ETV Bharat / state

విలక్షణ నటుడు... అభిమాన నేతకు నేడు కన్నీటి వీడ్కోలు - ex mp shvaprasad

వెన్ను, మూత్ర పిండ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచిన తెదేపా సీనియర్ నేత శివప్రసాద్ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4గంటలకు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్​ చిత్తూరు జిల్లా చంద్రగిరి వద్ద అగరాలలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు తిరుపతిలోని స్వగృహంలోనే ఆయన భౌతికకాయం ఉంచనున్నారు.

అభిమాన నేతకు నేడు కన్నీటి వీడ్కోలు
author img

By

Published : Sep 22, 2019, 6:33 AM IST

Updated : Sep 22, 2019, 7:44 AM IST

అభిమాన నేతకు నేడు కన్నీటి వీడ్కోలు

వెన్ను, మూత్ర పిండ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం తుది శ్వాస విడిచిన చిత్తూరు మాజీ ఎంపీ, తెదేపా సీనియర్ నేత శివప్రసాద్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. చంద్రగిరి సమీపంలోని అగరాల వద్ద సాయంత్రం 4 గంటలకు కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలకనున్నారు.

శోకసంద్రంలో అభిమానులు....

రాజకీయ నాయకుడిగా విలక్షణ నటుడిగా రెండు రంగాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్న మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ మరణంతో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన నేత శివప్రసాద్ మరణవార్త విని... ఆయన అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. వెన్ను, మూత్ర పిండ సంబంధిత అనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన శివప్రసాద్ పార్థివదేహాన్ని తిరుపతిలోని ఎన్జీవో కాలనీలోని స్వగృహానికి తరలించారు.

శివప్రసాద్ సేవలు అభినందనీయం....

శివప్రసాద్ భౌతిక కాయాన్ని పలువురు నేతలు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఎస్టీ, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి శివప్రసాద్ చేసిన కృషి అభినందనీయమని నేతలు కొనియాడారు.

కడసారి చూపుకు...బారులు

అభిమానులు, కార్యకర్తలు సందర్శనార్థం తిరుపతిలోని ఆయన స్వగృహం వద్ద శివప్రసాద్ భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభంకానుంది. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు అభిమానులు భారీగా తిరుపతికి తరలివస్తున్నారు.

ఇవీ చూడండి : సెప్టెంబరు 4 నుంచి బీఈడీ తరగతులు ప్రారంభం

Intro:ap_vja_45_21_votarla_vivaralu_paricilana_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. ఓటర్ల వివరాలు పరిశీలనలో భాగంగా రేపు ఆదివారం ఒక్కరోజే లక్షల ఓటర్లు వివరాలు పరిశీలించేందుకు ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టినట్లు స్వప్నాలు దినకర్ తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక రాజకీయ ప్రతినిధులు సామాజికవేత్తలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం అందరూ బి ఎల్ ఓ వారి పరిధిలోని ప్రతి ఇంటిలోని వాటర్ వివరాలు పరిశీలించి సూపర్వైజర్ల ద్వారా సాయంత్రానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు గ్రామ వాలంటీర్ల సహాయము తీసుకోవాలని మీడియా రాజకీయ పార్టీల ప్రతినిధులతో గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమం విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరు సహాయం తీసుకోవాలన్నారు డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఈ యాప్ ద్వారా ఎక్కువ కుటుంబాలు వారి వాటర్ వివరాలు పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ప్రస్తుతం ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలిపారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని గమనించి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు ప్రతి మహిళలు మరియు జాబ్ కార్డు దారులు వారి కుటుంబాల ఓటర్ల వివరాలు పరిష్కరించుకునే విధంగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు ఈ సమావేశంలో నూజివీడు మండలం తాసిల్దార్ ఎం సురేష్ కుమార్ వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ బిజెపి జిల్లా నాయకులు సిపిఎం డివిజన్ కార్యదర్శి జి రాజు సామాజికవేత్త ముత్యాల కామేష్ సిపిఐ నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు. 1) స్వప్న దినకర్ జివీడు సబ్ కలెక్టర్. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314).

Body:ఒక్క రోజులో లక్ష ఓటర్ల వివరాలు పరిశీలన

Conclusion:ఒక్క రోజుల్లో లక్ష వాటర ల వివరాలు పరిశీలన
Last Updated : Sep 22, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.