నిరుద్యోగులను మోసం చేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం వచ్చిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోత్స్న తిరునగరి అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆమె మండిపడ్డారు. దీనికి కారణమైన వారిని కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
గన్ పార్క్ వద్ద ఆందోళనలో పాల్గొన్న తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనా స్థలం నుంచి తరలించారు. నిధులు, నీళ్లు, నియామకాలంటూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న తెరాస సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలని యువతకు జ్యోత్స్న తిరునగరి సూచించారు.