భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పార్టీ నేత తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల వ్యవహారంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా భాజపా జాతీయ పార్టీ అని.. ఎవరు, ఎప్పుడైనా పార్టీలో చేరవచ్చని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. తెరాస నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తనను కలవలేదని.. పార్టీలో ఆయన చేరికపై తనకు సమాచారం లేదన్నారు. రాజకీయ క్షేత్రంలో ఏమైనా జరగవచ్చని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
మునుగోడు ఉపఎన్నికలో కూసుకుంట్లతో పాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్ సహా మరికొందరు నేతలు టికెట్ ఆశించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ కొందరు స్థానిక నేతలు ఏకంగా కేసీఆర్‌కే ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు సర్వేల ఆధారంగా కూసుకుంట్లనే బరిలోకి దించారు. అసంతృప్తులు చెలరేగకుండా ఆశావహులకు నచ్చజెప్పారు. అభ్యర్థిని ప్రకటించిన వెంటనే.. బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్‌తో భేటీ అయిన కేసీఆర్.. పార్టీ విజయానికి అందరూ కలిసి పని చేయాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే బూర నర్సయ్య గౌడ్ ప్రస్తుతం భాజపాలో చేరుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: మునుగోడులో జోరందుకున్న ప్రచారం.. ప్రజాక్షేత్రంలో పాగా వేసిన గులాబీదళం
'మునుగోడు ఉప ఎన్నికల్లోనూ భాజపాకు డిపాజిట్లు పోవడం ఖాయం'
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీ ప్రకటన.. గుజరాత్ విషయంలో ఈసీ ట్విస్ట్