అభినందనలు తెలిపిన ముఖ్యకార్యదర్శి హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో అధికారులు, సిబ్బందితో వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ బకాయిలు, ఎగవేతదారులు, కోర్టు వివాద కేసులు ఇలా వివిధ రకాల పన్నులను వసూలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో రూ.4600 కోట్లు, మార్చిలో రూ.5000 కోట్లు వసూలు అయ్యాయని తెలిపారు. ఇన్ని రోజులు కష్టపడిన అధికారులు, సిబ్బంది ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సోమేశ్‌కుమార్ సూచించారు.
ఇవీ చూడండి:రామన్నగూడెం @ 95%.. అందరూ గిరిజనులే... !