ETV Bharat / state

'తారకరత్న పూర్తిగా కోలుకుంటున్నారు.. త్వరలోనే సినిమా చేస్తాం' - ఆంధ్రప్రదేశ్ వార్తలు

Tarakaratna is fully recovering: సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తారకరత్నను చూసేందుకు సినీ నిర్మాత లక్ష్మీపతి, నిర్మాతల సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ఆసుపత్రికి విచ్చేశారు.

'తారకరత్న పూర్తిగా కోలుకుంటున్నారు.. త్వరలోనే సినిమా చేస్తాం'

author img

By

Published : Jan 31, 2023, 10:49 PM IST

Tarakaratna is fully recovering: సినీ నటుడు నందమూరి తారకరత్న గత నాలుగు రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ సినీ హీరోలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు సినీ నిర్మాత లక్ష్మీపతి, నిర్మాతల సంఘం సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ ఆసుపత్రికి విచ్చేశారు.

తారకరత్నను చూసిన అనంతరం లక్ష్మీపతి మాట్లాడుతూ.. తారకరత్నతో ఇంతకుముందే ఒక సినిమాను పూర్తి చేశానన్నారు. జనవరి 23వ తేదీ నుంచి ఆయనతో రెండవ సినిమా తీయడానికి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేశానని.. యువగళం పాదయాత్ర కారణంగా ఆయన ఫిబ్రవరి ఆరు తరువాత చిత్ర నిర్మాణం ప్రారంభించాలని తారకరత్న చెప్పినట్లు నిర్మాత తెలిపారు. 'బి అలర్ట్' అనే పేరుతో సినిమాను నిర్మించాల్సి ఉండగా.. ఇంతలోనే తారకరత్న అనారోగ్యానికి గురి కావడం చాలా బాధాకరమన్నారు. ఆయన త్వరగా కోలుకుంటారని..త్వరలోనే సినిమాను కూడా చేస్తామని ఆయన అన్నారు.

అనంతరం నిర్మాతల సంఘం సెక్రటరీ, తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. తారకరత్న ఆరోగ్యం మెరుగు పడుతోందన్నారు. ప్రస్తుతం ఆయన కాళ్లు, చేతులు కదుపుతున్నారని తెలిపారు. తారకరత్న వంద శాతం ఆరోగ్యవంతుడు అవుతారని.. ప్రజలందరూ తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారన్నారు.

తారకరత్న గారు వందశాతం సేఫ్‌గా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం మెరుగు పడుతోంది. ప్రస్తుతం ఆయన కాళ్లు, చేతులు కదుపుతున్నారు. -తుమ్మల ప్రసన్న కుమార్,నిర్మాతల సంఘం సెక్రటరీ

అసలేం ఏం జరిగిందంటే?: చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జనవరి 27న చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన ఆయన అకస్మాత్తుగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు, కుటుంబసభ్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

'తారకరత్న పూర్తిగా కోలుకుంటున్నారు.. త్వరలోనే సినిమా చేస్తాం'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.