ETV Bharat / state

తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా కన్నుమూత

author img

By

Published : Nov 15, 2020, 10:54 AM IST

ఏపీలోని తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1999-2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా రాజా పనిచేశారు.

తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా కన్నుమూత
తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా కన్నుమూత

ఏపీలోని తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వై.టి.రాజా...హైదరాబాద్‌లో వైద్య పరీక్షలకు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 1999-2004 వరకు తణుకు ఎమ్మెల్యేగా రాజా పనిచేశారు. తణుకు పురపాలక సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తణుకు కన్జ్యూమర్‌ కో-ఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.

తణుకులో జయలక్ష్మి ఫెర్టిలైజర్స్, విశాఖపట్నంలో ప్రత్యూష కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్​గా ఉన్నారు. కె.ఇల్లిందలపర్రు గ్రామంలో ప్రవాసాంధ్రులతో కలిసి ఏర్పాటు చేసిన డాక్టర్స్ ఆర్గానిక్ కెమికల్స్ సంస్థకు చాలా కాలం మేనేజింగ్ డైరెక్టర్​గా పని చేశారు. ఆయన మృతి పట్ల తెలుగు దేశం పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

చంద్రబాబు సంతాపం

తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టి.రాజా మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. తణుకు, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి కోసం రాజా పరితపించేవారని.... ఎమ్మెల్యేగా వై.టి.రాజా చేసిన కృషి మరువలేనిదన్నారు. రాజా మృతి పశ్చిమగోదావరి జిల్లాకు, తెదేపాకు తీరని లోటన్న చంద్రబాబు.. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెదేపాకు తీరని లోటు: అచ్చెన్న

వై.టి.రాజా మృతిపట్ల తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. వై.టి.రాజా మరణం తెదేపాకు తీరని లోటన్న అచ్చెన్న...తణుకు నియోజకవర్గ అభివృద్ధిలో రాజా పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

ఇదీ చదవండి: ఎమోషనల్‌ రాజకీయాలు‌ చేయం: జగ్గారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.