Tammineni on Congress Alliance : కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తు లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లో ఈసారి సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు. 24 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపాదనలు వచ్చినా 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో వారి జాబితాను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా గెలవకూడదనే తమ సిద్ధాంతమన్నారు. తాము పోటీ చేయని స్థానాల్లో బీజేపీని ఓడించే అవకాశం ఉన్నవారికి మద్దతు ఇస్తామని తమ్మినేని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
"పొత్తుల గురించి మాణిక్ రావు ఠాక్రే ఫోన్ చేసి మాట్లాడారు.. కలిసి పోటీ చేద్దామని చెప్పింది వారే. కాంగ్రెస్‌తో పొత్తు గురించి జాతీయ స్థాయిలో కూడా చర్చలు జరిపాం. వైరా, భద్రాచలం, పాలేరు స్థానాలు సీపీఎంకు ఇవ్వాలని కోరాం. దానికి వైరా, మిర్యాలగూడ సీట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తర్వాత వైరా స్థానం ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్నారు కాంగ్రెస్ నేతలు. భట్టి విక్రమార్క మాట మార్చారు" - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
CPI Narayana Reaction on Alliance : 'వామపక్షాలకి చెరో రెండు సీట్లు.. అది ప్రచారం మాత్రమే'
Tammineni Clarity on Alliance With Congress : సీట్ల విషయంలో కాంగ్రెస్ మాట మార్చిందని తమ్మినేని చెప్పారు. వైరా, భద్రాచలం, పాలేరు స్థానాలు అడిగితే మొదట వైరా, మిర్యాలగూడ సీట్లు ఇస్తామన్నారని చెప్పారు. ఇప్పుడేమో.. మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని చెబుతున్నారని అన్నారు. తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే చెరొక మంత్రి పదవి ఇస్తామంటున్నారని.. పొత్తులు పోగేసే పద్ధతి ఇది కాదని మండిపడ్డారు. తాము కోరిన స్థానాలకు కాంగ్రెస్ అభ్యంతరం తెలిపిందని వెల్లడించారు.
పట్టుదలకు పోకుండా భద్రాచలం, మధిర స్థానాలను వదులుకున్నామని తమ్మినేని వీరభద్రం అన్నారు. తమతో కాంగ్రెస్ పొత్తు వద్దని భావిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతల వైఖరి.. తమ పార్టీ నేతలను ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవమానకరంగా పొత్తులు అవసరం లేదని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వని కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని.. తమ్మినేని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు జరిగాక ఇక పొత్తు లేకుండా పోటీ చేయాలని సీపీఎం భావిస్తోందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌తో పొత్తు లేదు, రెండు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాం : తమ్మినేని
భద్రాచలం, అశ్వరావుపేటలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. నల్గొండ నుంచి 3 స్థానాల్లో, సూర్యాపేట నుంచి 2 సీట్లలో.. నకిరేకల్, భువనగిరి పోటీ చేస్తామని చెప్పారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి నుంచి పోటీ చేస్తామని వెల్లడించారు. హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్‌లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు.