Tammineni comments on Bjp: తెలంగాణలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం విస్తరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ప్రజా ఉద్యమాల నిర్మాణంతో సహా పలు అంశాలపై సీపీఎం నేతలు ఖమ్మంలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉన్నాయని తమ్మినేని ఆరోపించారు.
"మునుగోడు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించాం. రాబోయే కాలంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మునుగోడులో జరిగిన ఎన్నికలతో ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ పెరిగే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి లౌకిక రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్య వామ ప్రతిపక్షాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని అభిప్రాయపడ్డాం. కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఉంటుంది. దాని దుర్మార్గాలు ఎక్కువగా చర్చకు రావట్లేదు. వ్యవసాయ విధానాలు గానీ, ఆర్థిక వ్యవస్థని వాళ్లు నడిపిస్తున్న తీరు ప్రైవేటీకరణ ఎంత వేగంగా చేస్తున్నారు. అనేక రూపాల్లో రాష్ట్ర ఫెడరల్ హక్కులపై దాడులు చేస్తోంది బీజేపీ ప్రభుత్వం" -తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ఇవీ చదవండి: