అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన శాస్త్రవేత్తల ర్యాంకుల్లో తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ అలగర్ స్వామికి అంతర్జాతీయంగా 1561 స్థానం వచ్చింది. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన సైన్స్ జర్నల్స్ లో ప్రచురితంమైన పరిశోధన పత్రాలు, ప్రయోగాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షమంది శాస్త్రవేత్తలను గుర్తించింది. వారి పరిశోధనల ఆధారంగా అంతర్జాతీయ, జాతీయస్థాయిలో ర్యాంకులు ప్రకటించింది.
అలగర్ స్వామికి ఫార్మసీ విభాగంలో అఖిల భారత స్థాయిలో 22వ ర్యాంకు వచ్చింది. ప్రస్తుతం అలగర్ స్వామి క్షయ, ఎయిడ్స్ వ్యాధుల నివారణకు సింథటిక్ మెడిసిన్‌పై పరిశోధనలు చేస్తున్నారు. ఈయన రచించిన పుస్తకాలను బీఫార్మా, ఏంఫార్మా, ఫార్మాడీ కోర్సులలో పాఠ్యాంశాలుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 150 పరిశోధన పత్రాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితం కాగా.. వాటిలో 117 పత్రాలను స్టాన్ఫోర్డ్ బృందం పరిగణనలోకి తీసుకుంది. ఈ ర్యాంకు తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, అంతర్జాతీయంగా ఇతర పరిశోధన సంస్థలతో కలిసి మరిన్నీ ప్రయోగాలు చేయడానికి, నిధులు పొందడానికి దోహద పడుతుందని అలగర్ తెలిపారు.
ఇదీ చూడండి : గాడియం స్పోర్టోపియా అథ్లెటిక్స్ వార్షికోత్సవాల్లో జయేష్ రంజన్