Talked about the Kadapa Steel Plant Thalasani: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కేంద్రం ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చిందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వని కేంద్రం.. ఏపీకి మాత్రం ఫర్మిషన్ ఇవ్వడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు.
బీజేపీ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని తలసాని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈసీ ఆ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చిందని తెలిపారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి తాము అనుమతి అడిగితే మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ నెల 17న ప్రారంభిస్తామని గతంలోనే ప్రకటించామని గుర్తు చేశారు. అయినా కూడా ఫర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ సర్కారుకు అనుమతి ఇచ్చారని తమకేం ఈర్ష్య లేదన్నారు. తాము నూతన సచివాలయం కట్టడం చూసి కొంత మంది ఓర్వలేక పోతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో చెబుతున్నామని అన్నారు. కేంద్రం తీరు ఎలా ఉందో దేశంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల కార్యక్రమాల గురించి చెప్పారు. వామపక్షాల పొత్తుల అంశం గురించి పార్టీ ప్రధాన అధ్యక్షుడు కేసీఆర్ చెబుతారని అన్నారు.
"ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన అనుమతులు మేము ప్రారంభించే సచివాలయ విషయంలో ఏమయ్యాయి? ఏపీకీ అనుమతి ఇచ్చినందుకు మాకేం ఈర్ష్య లేదు. అవే అనుమతులు మా ప్రభుత్వానికి ఇవ్వవచ్చు కదా.. వ్యవస్థ ఎటువెళ్తోందని దేశం మొత్తం గమనిస్తోంది."-తలసాని శ్రీనివాస్‌యాదవ్, పశుసంవర్థక శాఖ మంత్రి
ఇవీ చదవండి: