ETV Bharat / state

గెలుపులో మాకు మేమే పోటీ: తలసాని - MIM

లోక్​సభ ఎన్నికల్లో హైదరాబాద్​లో ఎంఐఎంతో మైత్రి కొనసాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 17 పార్లమెంట్ స్థానాలను తెరాస కూటమి గెలుచుకుంటుందని వెల్లడించారు. ఈ నెల 13న సికింద్రాబాద్ బోయిన్​పల్లి​లో జరిగే సభ ఏర్పాట్లను పరిశీలించారు.

గెలుపులో మాకు మేమే పోటీ
author img

By

Published : Mar 9, 2019, 5:54 PM IST

పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మేమే పోటీ:తలసాని
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా అడ్రస్‌ గల్లంతుకావడం ఖాయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పోటీ చేయకుంటే బాగుండదనే ప్రతిపక్షాలు అభ్యర్థులను నిలబెడుతున్నాయన్నారు. గెలుపులో మాత్రం తమకు తామే పోటీలో ఉన్నామన్నారు.

బోయిన్​పల్లి సభ ఏర్పాట్ల పరిశీలన

ఈ నెల 13న బోయిన్​పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ తెరాస సన్నాహక సమావేశ ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రితో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌, స్టీఫెన్ సన్ ఉన్నారు.

ఇవీ చూడండి:నీలోఫర్​ ఘటనపై సర్కార్ సీరియస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.