ETV Bharat / state

తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలే: తలసాని

దేవాలయ భూములు, ప్రైవేటు భవనాలపై తప్పుడు ఫిర్యాదులు చేస్తే తాడా చట్టం ద్వారా చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ హెచ్చరించారు. హైదరాబాద్​ మసాబ్ ట్యాంక్​లోని మత్స్య శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

talasani srinivas yadav review on temple lands and private buildings constructions  in hyderabad
తప్పుడు ఫిర్యాదులు చేస్తే చర్యలే: తలసాని
author img

By

Published : Sep 24, 2020, 2:27 PM IST

హైదరాబాద్​ మసాబ్ ట్యాంక్​లోని మత్స్యశాఖ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాలయాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.

గోషామహల్​లో ఉన్న 50 దేవాలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. అందుకోసం ఓ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ దేవలయాల స్థితిగతులపై వివరాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తుందని చెప్పారు. గోషామహల్​లో కొందరు పనిగట్టుకుని భవనాలపై ఫిర్యాదులు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని చెప్పారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: చర్ల ఎదురు కాల్పులపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.