దేశ మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 15వ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్రపటానికి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం పీవీ నరసింహారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండరను మంత్రి ఆవిష్కరించారు. నరసింహారావు అనేక సంస్కరణలకు ఆద్యుడని, భవిష్యత్తుకు పునాదులు వేసిన నాయకుడని కొనియాడారు. భారత ఆర్థిక రంగాన్ని పటిష్ట పరిచిన నేత పీవీ నరసింహారావు అని తలసాని ప్రశంసించారు.
ఇవీ చూడండి: 'దిశ' నిందితుల మృతదేహాలకు కొనసాగుతున్న రీపోస్టుమార్టం