తనలాగే తన కుమారుడు సాయికిరణ్‌ను ఆదరించి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీప్రముఖులను కోరారు. ఫిల్మ్‌నగర్‌లోని ఎఫ్ఎన్సీసీ క్లబ్లో చలన చిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు, చిత్రపురి హిల్స్ కాలనీ సభ్యులతో సమావేశమయ్యారు. తన కుమారుడు సాయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సాయికిరణ్ గెలిపిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో యువతరానికి ప్రాధాన్యతనిస్తే దేశం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి:మహబూబాబాద్, ఖమ్మంలో నేడు కేసీఆర్ పర్యటన