ETV Bharat / state

లాక్​డౌన్ పట్టించుకోని పాస్టర్లు... అరెస్టు చేసిన పోలీసులు - లాక్​డౌన్ పట్టించుకోని పాస్టర్లు

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలు బయట తిరగవద్దని అధికారులు ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ కొందరు పట్టించుకోవటం లేదు. ఎక్కడా గుమిగూడవద్దని సూచిస్తున్నా లెక్కచేయటం లేదు. ఆంధ్రప్రదేశ్​లోని తాడేపల్లిగూడెంలోని ఓ చర్చిలో సుమారు 50మంది పాస్టర్లు సమావేశమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.

tadepalli-police-arrested-49-pastors-who-met-at-the-church
లాక్​డౌన్ పట్టించుకోని పాస్టర్లు... అరెస్టు చేసిన పోలీసులు
author img

By

Published : Apr 4, 2020, 4:33 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నా ఇదేమీ పట్టనట్లుగా కొందరు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం అవుతున్నారు. ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ వారి తీరులో మార్పు రావడం లేదు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలోని ఎల్​ఎల్​ఎం చర్చిలో నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారు.

లాక్​డౌన్ పట్టించుకోని పాస్టర్లు... అరెస్టు చేసిన పోలీసులు

తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించిన పాస్టర్లు అందరూ చర్చిలో సమావేశానికి హాజరయ్యారు. స్థానికులు సమాచారం అందించటంతో పోలీసులు దాడి చేసి 49 మంది పాస్టర్లను పోలీస్ స్టేషన్​కు తరలించారు. పాస్టర్లు అందరికీ పట్టణ సీఐ ఆకుల రఘు కౌన్సిలింగ్ ఇచ్చారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వారు సామూహికంగా ప్రార్థనలు చేయటం ఏంటని నిలదీశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని రఘు మీడియాకు తెలియజేశారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని పట్టణ సీఐ ఆకుల రఘు సూచించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 180 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.