ETV Bharat / state

కరోనా కట్టడిలో తెరాస తీరును ఎండగట్టిన కాంగ్రెస్‌ నేతలు - తెలంగాణ తాజా వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవగాహనా రాహిత్యంతోనే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి పెరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ఆరోపించారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫలమైందని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా మీడియా సమావేశాల ద్వారా కొవిడ్‌ కట్టడిలో తెరాస తీరును ఎండగట్టింది. బాధితుల వీడియోలు చూసైనా.... ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలలో మార్పు రావాలని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హితవు పలికారు.

congress leaders criticized telangana government
కరోనా కట్టడిలో తెరాస తీరును ఎండగట్టిన కాంగ్రెస్‌ నేతలు
author img

By

Published : Jul 1, 2020, 4:43 AM IST

కరోనా నియంత్రణలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. సీఎం అసమర్థత వల్లే రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి పెరిగిందని విమర్శించారు. టెస్టుల విషయంలో ప్రజల్ని మోసం చేస్తూ పట్టుబడిందని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వారం రోజుల్లో 50వేల పరీక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ఎక్కడికెళ్లి వైద్యం చేయించుకోవాలి?

రాష్ట్రంలో సామాన్యుడు ఎక్కడికెళ్లి వైద్యం చేయించుకోవాలో తెలియని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆస్పత్రుల్లో రోజుకో వైఫల్యం బయటపడుతోంది

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ విధించాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. ఆస్పత్రుల్లో రోజుకో వైఫల్యం బయటపడుతోందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ వైఖరి కారణంగా.. కరోనా నియంత్రణలో రాష్ట్రం పరువు పోతోందని ఆరోపించారు. తక్షణమే మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

లోపాలు సరిచేయండి

ప్రజలు తమకు సరైన వైద్యం అందడం లేదని సెల్ఫీ వీడియోలు పెడుతుంటే.... లోపాలు సరిచేయకుండా ప్రభుత్వం వితండ వాదానికి దిగుతోందని.... పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కాపాడాలని పొన్నం హితవు పలికారు.

కరోనా వ్యాప్తిలో ముందున్నాం..

లాక్‌డౌన్‌ విధిస్తే..... ముందుగానే పేదల ఖాతాల్లో రూ.10,000 చొప్పున జమచేయాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు. అన్నింట్లో నంబర్‌ వన్‌ అంటూ కరోనా వ్యాప్తిలోనూ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో విపరీతంగా కేసులు పెరుగుతున్నా... ఇప్పటికీ ఎటువంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని మల్లు రవి ఆరోపించారు.

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి

సెల్ఫీ తీసుకుని చనిపోయిన అంశాన్ని మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకోవాలని...లేకుంటే తామే కలిసి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కరోనా నియంత్రణలో తెరాస తీరును ఎండగడుతూ మీడియా సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని హైదరాబాద్‌లో మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చకుంటే తాను దీక్ష చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ కొవిడ్‌ నిధులు ఏం చేశారని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.

కేసీఆర్‌ తన తీరు మార్చుకుని.....విపక్షాల సలహాలు స్వీకరిస్తూ... ఇకనైనా కరోనా కట్టడిలో ముందుకెళ్లాలని కాంగ్రెస్‌ హితవు పలికింది.

ఇవీచూడండి: రాష్ట్రంలో మరో 945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.