Group3 Exams Syllabus released: రాష్ట్రంలో గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా.. దరఖాస్తుల పక్రియ జనవరి 24 నుంచే మొదలైంది. గ్రూప్ 3 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్‌లో పేర్కొంది. వీటితో పాటు సిలబస్‌ను కూడా టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్లో ఉంచారు.
గ్రూప్ 3 ఉద్యోగాలకు విద్యార్హతలు, వయో పరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో పాటు పరీక్ష సిలబస్‌ను నోటిఫికేషన్‌లో పొందుపరిచింది. ఆబ్జెక్టివ్ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లోనా అనేది అధికారులు స్పష్టం చేయలేదు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణితో కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మంచిదని సూచించింది.
జులై లేదా ఆగస్టులో పరీక్షలు?: రానున్న జులై లేదా ఆగస్టులో గ్రూపు-3 పరీక్ష జరగనుంది. ఈ మేరకు మొత్తం 1363 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 23 వరకు గడువిచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్లో సవివర నోటిఫికేషన్‌ను పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుల కోసం లింక్‌ను కూడా పొందుపరిచింది. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థి 12 కేంద్రాలను ప్రాధాన్యం వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష జరుపుతారు. వీటిలో అత్యధికంగా ఆర్థికశాఖలోనే 712 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో ఈ మంగళవారం నుంచి వెబ్‌సైట్లో సమగ్ర నోటిఫికేషన్‌ను పొందుపరిచారు.
ఇవీ చదవండి: