హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు... ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ ఆధారిత రవాణా కార్మికుల జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ వెల్లడించారు. స్విగ్గీ సంస్థలో 5 సంవత్సరాలుగా పని చేస్తున్నామన్నారు. తమకు ఇంతకముందు ఆర్డర్‌కి రూ.35 రూపాయలు ఇచ్చేవారని... ప్రస్తుతం రూ.15 రూపాయలకు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే కాకుండా తమను వేరే జోన్లకు కలిపారని... ఎంత దూరం వెళ్ళినా కిలో మీటర్‌కి రూ.6 చొప్పునే ఇస్త్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలో ధర రోజురోజుకు పెరుగుతూ పోతుందని... ఇలాంటి సమయంలో తమను ఆదుకోవాలని సమ్మెకు దిగారు. వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఈ కామర్స్ పేరిట తెరవెనుక ఆన్‌లైన్ జూదం... యువకులకు వల