స్విగ్గీ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన ప్రదర్శన చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హిమాయత్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. స్విగ్గీ యాజమాన్యం థర్డ్ పార్టీని పెట్టి తమ పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
థర్డ్ పార్టీకీ ఎక్కువ కమీషన్ ఇస్తూ... తమకు తక్కువ ఇస్తున్నారని ఆరోపించారు. కంపెనీపై కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మినిమమ్ ఆర్డర్ బిల్స్ మీద 35 రూపాయలు... బ్యాచ్ ఆర్డర్ బిల్స్ మీద 20 రూపాయలు చెల్లించాలని కోరారు. తాజాగా కోతలతో రోజుకు రూ.200 కూడా సంపాదించలేని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: సరూర్ నగర్ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి: చాడ