ETV Bharat / state

Swiggy Delivery Boys Dharna: అందరి కడుపులు నింపుతున్నాం.. మా కడుపు నింపరా.. - స్విగ్గీ డెలివరీ బాయ్స్ ధర్నా

మనం ఆకలిగా ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టగానే ఆహారాన్ని తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్స్ నిరసన బాట పట్టాడు. తమ పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా స్విగ్గీ యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తోందని సమ్మె ద్వారా తన అసంతృప్తిని తెలియపరుస్తున్నాడు. తమ (Swiggy delivery boys Dharna)న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకు ఫుడ్ ఆర్డర్లు స్వీకరించేది లేదని హైదరాబాద్ వ్యాప్తంగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ స్పష్టం చేస్తున్నారు. దీంతో స్వీగ్గీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్లపై ఈ ప్రభావం కనిపించింది.

Swiggy Delivery Boys Dharna
హైదరాబాద్‌లో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళన
author img

By

Published : Nov 29, 2021, 5:16 PM IST

Updated : Nov 29, 2021, 9:36 PM IST

Swiggy delivery boys in hyderabad: హైదరాబాద్ వంటి నగరంలో ఫుడ్ డెలివరీ యాప్‌లకు(food delivery apps in hyderabad) విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వీటిలో టాప్‌లో ఉన్న వాటిలో ఒకటి జొమాటో కాగా.. మరొకటి స్విగ్గీ. అసంఘటిత రంగంలో పనిచేసే డెలివరీ బాయ్స్ రోజూ పన్నెండు గంటలకు మించి కష్టపడుతున్నా.. చాలీచాలని జీతాలతో జీవితాలను(delivery boys salaries) నెట్టుకొస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా పార్ట్ టైం, ఫుల్ టైం షిప్టుల్లో దాదాపు 20 వేలమందికి పైగా స్విగ్గీ డెలివరీ బాయ్స్ పనిచేస్తున్నారు. పలు రెస్టారెంట్ల నుండి ఆర్డర్లు తీసుకొని వినియోగదారుడి ఇంటివద్దకే డోర్ డెలివరీ చేస్తున్నారు. అయితే కొవిడ్ అనంతర పరిస్థితుల తర్వాత ఆహార రంగం వేగంగా కోలుకున్నా.. వీరి బతుకు బండి మాత్రం కుదేలైందని రైడర్స్(swiggy riders) వాపోతున్నారు. పెట్రోల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల తమ ఆదాయాలకు భారీగా గండి పడిందని డెలివరీ బాయ్స్ ఆవేదన చెందుతున్నారు. రోజుకు 12-15 గంటలు పనిచేస్తున్నా ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు లాంటి కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు.

డెలివరీ బాయ్స్ నిరసన బాట

గతంలో రూ.35 ఇచ్చేవారు

ఒకప్పుడు మినిమం బేస్ ఫెయిర్ 35 రూపాయలను చెల్లించిన స్విగ్గీ యాజమాన్యం(swiggy management).. దాన్ని క్రమంగా 20 రూపాయలకు తగ్గించిందని వాపోయారు. పెరుగుతున్న ఖర్చులకు ఇది ఏమాత్రం లాభసాటి కాదని కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ నుంచి డెలివరీ బాయ్స్ లొకేషన్ దూరానికి మాత్రమే ఛార్జీలు చెల్లిస్తున్నాయి. డోర్ స్టెప్ డెలివరీకి, మరిన్ని ఆర్డర్లు తీసుకునేందుకు తిరిగి రెస్టారెంట్‌కు చేరుకునేందుకు సమయం పెరిగి ఆదాయం తగ్గుతోందని కార్మికులు చెబుతున్నారు. వీటితో పాటు.. కంపెనీకి పనిచేసే స్విగ్గీ డెలివరీ బాయ్స్‌తో(swiggy delivery boys) పాటు.. ర్యాపిడో, షాడో ఫాక్స్ వంటి థర్డ్ పార్టీలకు ఆర్డర్ల(third parties in delivery) కేటాయింపుతో వీరి ఆదాయానికి గండి పడుతోంది. వీటికి తోడు దూరప్రాంతాల్లో డెలివరీలకు ప్రతి కిలోమీటర్ ఇచ్చే అదనపు ఛార్జీలను సగానికి తగ్గించారని.. వీటన్నింటినీ కంపెనీ సమీక్ష జరపాలని కార్మికులు కోరుతున్నారు.

డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె

తమ న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించేవరకు సమ్మె రూపంలో తమ నిరసన కొనసాగుతుందని డెలివరీ బాయ్స్(swiggy delivery boys protest in hyderabad) స్పష్టం చేస్తున్నారు. నగరవ్యాప్తంగా దాదాపు 15 జోన్లలో 20 వేల పైచిలుకు డెలివరీ బాయ్స్ స్విగ్గీ కోసం పనిచేస్తుండగా.. వీరిలో మెజారిటీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. ఎవరైనా ఆర్డర్లు తీసుకున్నట్లు తెలిసినా.. వారిని నిలువరిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. యాజమాన్యం దిగిరాని పక్షంలో తమ తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్‌కు అనుకూలంగా తమ మద్దతు అందించాలని వారు... కస్టమర్లు, రెస్టారెంట్‌ నిర్వాహకులను అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చూడండి:

Suicide Video: స్విగ్గీ బాయ్​ సూసైడ్​.. సెల్ఫీ వీడియోతో సందేశం.. ఎవరికంటే..?

స్విగ్గీ డెలివరీ విమెన్‌కు రెండురోజుల నెలసరి సెలవులు

GST on Swiggy: స్విగ్గీ, జొమాటో సేవలపై జీఎస్​టీ?

Last Updated : Nov 29, 2021, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.