హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ ఆటోల్లో పనిచేస్తూ 15 వేల కార్మికులం ఉన్నామని.. తమ కుటుంబాలు అనారోగ్యానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి రోజూ విధులు నిర్వహిస్తున్నామని.. కానీ ఏ అధికారులు, దాతలు తమను ఆదుకోవడం లేదని వారు వాపోతున్నారు.
అందరితోపాటు మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమకు ఎటువంటి శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు ఇవ్వలేదని.. తాము రోజు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్నామని ఎవరింట్లో కరోనా ఉందో లేదో తెలియదని, వారి ఇంటికి వెళ్లి చెత్త సేకరించడం వల్ల చాలా మంది కార్మికులు, పిల్లలు అనారోగ్యాలపాలవుతున్నారని స్వచ్ఛ ఆటో సంఘం అధ్యక్షుడు వీరన్న ఆవేదన వ్యక్తం చేశాడు.
తమకు రేషన్ కార్డులు లేవని, తమను ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'కాబోయే అమ్మ'పై కరోనా వైరస్ ప్రభావం