ETV Bharat / state

'బహిర్గతమైన నేను' గ్రంథాన్ని ఆవిష్కరించిన స్వామి జ్ఞానదానంద - swamy-gnanaananda-who-has-unveiled-the-book-i-revealed-at-ramakrishna-matam

ఆత్మ శరీరంలో ఎక్కడ ఉంటుందో ఇంతవరకు కనిపెట్టిన జ్ఞానులు లేరని రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద అన్నారు. ఆదివారం దోమలగూడలోని వివేకానంద మానవ వికాస కేంద్రంలో ‘బహిర్గతమైన నేను’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు.

who has unveiled the book 'I Revealed at Ramakrishna matam
'బహిర్గతమైన నేను' గ్రంథాన్ని ఆవిష్కరించిన స్వామి జ్ఞానదానంద
author img

By

Published : Dec 23, 2019, 1:03 PM IST

డా.పి.శివరాం ప్రసాద్‌ తెలుగులోకి అనువాదించిన 'బహిర్గతమైన నేను' గ్రంథాన్ని రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి జ్ఞానదానంద ఆవిష్కరించారు. ఆదివారం దోమలగూడలోని వివేకానంద మానవ వికాస కేంద్రంలో జరిగిన గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్ణాటకలోని శ్రీధర్‌ మహారాజ్‌ సమాధిని దర్శించుకున్న తరువాత అక్కడ ఆంగ్లంలో ఉన్న గ్రంథం తనను ఆకర్షించిందని బి.ఐ.టి విద్యాసంస్థల (హిందూపురం) ఛైర్మన్‌ డా.పరిటాల చంద్రమోహన్‌ అన్నారు. తెలుగులో అనువాదించాలనే సంకల్పంతో డా.పి. శివరాం ప్రసాద్​కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

రచయిత శ్రీధర్‌భట్ ఆంగ్లంలో రచించిన గ్రంథాన్ని శివరాం తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌, రచయిత డా.వై.శివరాంప్రసాద్‌, ఎస్‌కే విశ్వవిద్యాలయం విశ్రాంత రిజిస్ట్రార్‌ డా.కె.సుధాకర్‌బాబు, ప్రముఖ వ్యాఖ్యాత దక్షిణామూర్తి, పరిటాల వేణుగోపాల్‌, టి.సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

'బహిర్గతమైన నేను' గ్రంథాన్ని ఆవిష్కరించిన స్వామి జ్ఞానదానంద

ఇదీ చూడండి:జనవరి 1నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాల తనిఖీలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.