ETV Bharat / state

'బంగారు బాల' పేరుతో వంద మంది విద్యార్థులకు చెక్కుల పంపిణీ - సువర్ణ ఫౌండేషన్‌ తాజా వార్తలు

కరోనా సంక్షోభంలో లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోయిన మధ్యతరగతి కుటుంబాలకు సువర్ణ ఫౌండేషన్‌ చేయూత నిచ్చింది. ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది.

suvarna foundation distributed money to poor pupils in hyderabad
'బంగారు బాల' పేరుతో వంద మంది విద్యార్థులకు చెక్కుల పంపిణీ
author img

By

Published : Oct 16, 2020, 4:58 PM IST

లాక్ డౌన్ కారణంగా ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు సువర్ణ ఫౌండేషన్ అండగా నిలిచింది. 'బంగారు బాల' పేరుతో వంద మంది విద్యార్థులకు రూ. 16 లక్షల చెక్కులను అందజేసింది. నిర్వాహకులు అబిడ్స్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు. కరోనా సంక్షోభంలో ఉపాధి లేక మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయాయనీ, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఫౌండేషన్ ఛైర్మన్ రాజేష్ తెలిపారు.

రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'మహిళల వివాహ కనీస వయసుపై త్వరలోనే నిర్ణయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.