ETV Bharat / state

SUSPICIOUS DEATH: పెళ్లి బరాత్​లో యువకుడి మృతి.. అసలేం జరిగింది? - తెలంగాణ తాజా వార్తలు

రాయదుర్గం పోలీస్ స్టేషన్​ పరిధిలో నరేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలిసులు దాడి చేయడం వల్లే యువకుడు మరణించాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.

SUSPICIOUS DEATH
యువకుడు అనుమానాస్పద మృతి
author img

By

Published : Aug 28, 2021, 1:58 PM IST

పెళ్లి బరాత్​ వల్ల ఇబ్బంది కలుగుతోందని రాయదుర్గం పోలీసుకు రాత్రి 11.30 గంటలకు ఫోన్ వచ్చింది. పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్లను పంపించేశారు. కొద్దిసేపటికే మళ్లీ ఫోన్ వచ్చింది. ఈ సారి పోలీసులు అక్కడ ఉన్నవాళ్లను చెదరగొట్టారు. ఈ క్రమంలో బ్యాండ్ యువకులు పరుగులు తీశారు. తప్పించుకునే ప్రయత్నంలో నరేశ్(30) వాహనంలో నుంచి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి.

నరేశ్​ను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని రామగిరి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే... పోలీసులు కొట్టడంతోనే నరేశ్ మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నరేశ్​కు ఇదివరకే ఆరోగ్యం బాగా లేదని, ప్రమాదవశాత్తు వాహనం బంపర్ తలకు తగిలి మృతిచెందాడని రాయదుర్గం సిఐ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

పెళ్లింట విషాదం.. కారు ప్రమాదంలో నవవధువు, ఆమె తండ్రి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.