ETV Bharat / state

తిరుమలగిరిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి - అనుమానాస్పద మృతి

సికింద్రాబాద్​ బోయిన్ పల్లి మార్కెట్​ యార్డ్ సమీపంలో ఓ వ్యకి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుమలగిరిలో అనుమానాస్పద మృతి
author img

By

Published : Jul 12, 2019, 8:46 AM IST

తిరుమలగిరిలో అనుమానాస్పద మృతి..?

సికింద్రాబాద్​ బోయిన్ పల్లి మార్కెట్ యార్డు సమీపంలో ఓ వ్యకి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో అల్వాల్ వెంకటపురంలో నివాసముండే పొన్ను స్వామి, నవనీత దంపతులకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. కుటుంబ కలహాలతో గత 7 ఏళ్ల నుంచి భార్యా భర్తలు విడిపోయి ఉంటున్నారు. అప్పటి నుంచి స్వామి బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

గురువారం ఉదయం 10 గంటలకు మార్కెట్​లోని క్యాంటీన్ సమీపంలో మృత దేహం ఉంది. స్వామి మృతదేహాన్ని చూసిన వాచ్​మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. చనిపోయింది స్వామి అని పోలీసులు గుర్తించారు. తన భర్త అనారోగ్యం వల్లే చనిపోయాడని, తమకు ఎలాంటి అనుమానాలు లేకపోయినా దర్యాప్తు చేపట్టాలని మృతుడి భార్య పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : సికింద్రాబాద్​లో ప్రపంచకప్​ సెమీఫైనల్​పై బెట్టింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.