హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని మోహన్‌నగర్‌లో సరూర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ తన ఇంట్లో అనుమాస్పదంగా మృతిచెందాడు. మెడపై గాట్లు ఉండడం వల్ల గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు కొన్నేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తూ మోహన్‌నగర్‌లో అపార్ట్మెంటులో అద్దెకు ఉంటున్నాడు. ఈ రోజు అతని కుటుంబసభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానంతో ఇంటికొచ్చి చూసేసరికి విగతజీవిగా పడిఉన్నాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: వివికా మరణం ప్రమాదమా..? ఆత్మహత్యా..?