విప్లవ కవి వరవరరావు ఆరోగ్యం క్షీణించడం పట్ల సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఏ కేసు నమోదు చేయకుండా ఆయనపై తప్పుడు ఆరోపణలు మోపీ నిర్బంధంలో ఉంచారని ఆయన మండిపడ్డారు.
వరవరరావు ఉన్న తలోజా జైళ్లోని ఓ ఖైదీ కరోనాతో మరణించడం వల్ల తనను బెయిల్పై విడుదల చేయాలని పెట్టుకున్న దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకుండా తాత్సరం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇది అత్యంత క్రూరమైన నిర్బంధకాండని విమర్శించారు. వరవరరావుతో పాటు ఎల్గార్ పరిషద్ కేసులో ఉన్న రాజకీయ ఖైదీలందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరవరరావును హైదరాబాద్‌లోని ఆసుపత్రికి మార్చాలని కోరారు.