ETV Bharat / state

'విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నాం' - Supreme on disha case encounter latest updates

చటాన్​పల్లి వద్ద జరిగిన దిశ నిందితుల ఎన్​కౌంటర్​ను సవాల్​ చేస్తూ.. న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా పడింది.

Supreme on disha case encounter victims
దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై సుప్రీం
author img

By

Published : Jan 10, 2020, 4:34 PM IST

దిశ కేసు నిందితుల ఎన్​కౌంటర్​పై ఇప్పటికే న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని.. విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఏ బొబ్డే పేర్కొన్నారు. ఎన్​కౌంటర్​ను సవాలు చేస్తూ.. న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్, ఎంఎల్ శర్మ, ముకేశ్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కమిషన్ విచారణ జరుపుతోందని స్పష్టం చేసింది.

దిశ ఘటనలో మీడియా ప్రసారాలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసులను న్యాయవాది ఎంఎల్ శర్మ ప్రస్తావించగా.. మాట్లాడే హక్కు మీడియాకు ఉందని, కానీ మీడియా ప్రత్యేకించి సదరు వ్యక్తి తప్పు అని చెప్పేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ కేసు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు సీజేఐ తెలిపారు.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై గులాబీ గురి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.