ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కార్యాలయాలకు వేసిన రంగులను 4 వారాల్లో తొలగించాలని ఆదేశించింది. రంగులు తొలగించకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం... జీవో 623పై హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత రంగులు తొలగించకుండా తప్పు చేశారని పేర్కొంది. మళ్లీ వేరే రంగు జతచేసి జీవో ఎందుకు తెచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని వాదనలతో కలిపి రెండు పేజీల తీర్పు ఇచ్చింది.