SC On Gangi Reddy Bail Petition : గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం.. బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. గతంలో బెయిల్ మంజూరు చేసినప్పుడు మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోలేదన్న సుప్రీం.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వివేకా హత్యకేసును సుప్రీంకోర్టే తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసినందున.. గంగిరెడ్డికి బెయిల్ రద్దుచేసే విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.
Gangi Reddy bail petition transfer to Telangana : వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈయన బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర పోలీసుల చేతులో విచారణ ఉన్నప్పుడు బెయిల్ వచ్చిందని సుప్రీంకోర్టులో.. సీబీఐ వాదనలు వినిపించింది. బెయిల్ రద్దు చేయాలన్న తమ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించిందని పేర్కొంది. దర్యాప్తునకు ఎర్ర గంగిరెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడన్న ఆయన తరఫు న్యాయవాది.. బెయిల్ రద్దు అవసరం లేదని పేర్కొన్నారు.
ఒక వేళ బెయిల్ రద్దు చేస్తే ఏ హైకోర్టుకు ఇవ్వాలో చెప్పాలని సుప్రీం ధర్మాసనం అడిగింది. ఇప్పటికే వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేసినందున.. ఈ కేసును కూడా తెలంగాణకే బదిలీ చేయాలని సీబీఐ కోరింది. దాంతో సీబీఐ వాదనలతో ఏకీభవించిన సుప్రీం.. తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: