ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకోవచ్చు'

రాష్ట్రాలకు రిజర్వేషన్లు చేసే అధికారం ఉంటే.. కులాల ఉప వర్గీకరణ కూడా చేసే అధికారం ఉన్నట్లేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ అంశాన్ని పరిశీలించేందుకు ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉన్న విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలని సుప్రీం తెలిపింది.

author img

By

Published : Aug 28, 2020, 7:12 AM IST

supreme court said SC and ST reservations can be classified by states
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలే వర్గీకరించుకోవచ్చు

రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సమాఖ్య వ్యవస్థలో ఎస్సీ, ఎస్టీలు, సామాజికంగా ఇతరత్రా వెనుకబడిన తరగతులను పైకితేవడానికి అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఉంది. ప్రెసిడెన్షియల్‌ నోటిఫికేషన్‌లో మార్పులు, చేర్పులు చేసేంతవరకే పార్లమెంటుకు అధికారం ఉంది. జాబితాలో ఉన్న వారికి క్షేత్రస్థాయిలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. వెనుకబడిన వారిని పైకి తేవాలన్న లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలపై రాజ్యాంగపరమైన ఆంక్షలేమీ లేవు. కొన్ని వర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రిజర్వ్‌డ్‌ సీట్లలో కొంత శాతాన్ని వారికి కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341, 342, 342ఎల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పలేం’’ అని జస్టిస్‌ అరుణ్‌మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. ఇతరుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎస్సీ, ఎస్టీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వొచ్చని అభిప్రాయపడింది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2005 నాటి ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ 2014లో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే అంతే సంఖ్యలో న్యాయమూర్తులున్న తమ ధర్మాసనానికి ఆ తీర్పును సమీక్షించే అధికారం లేనందున ఇప్పుడు దాన్ని ఏడుగురు అంతకంటే ఎక్కువ సభ్యులతో కూడిన ధర్మాసనానికి పంపాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కేసులో...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాసనసభ చట్టం ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించడాన్ని 2005లో కొట్టేస్తూ ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ తర్వాత కూడా పంజాబ్‌తోపాటు దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేశాయి. వాటిని ఆయా హైకోర్టులు కొట్టేయడంతో అన్ని రాష్ట్రాలు కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2014లో త్రిసభ్య ధర్మాసనం ఆ కేసులన్నింటినీ అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రతిపాదించింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ అరుణ్‌మిశ్ర, జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ వినీత్‌శరణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతోకూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఒకవైపు ఈవీచెన్నయ్య కేసును విస్తృత ధర్మాసనానికి పంపుతూనే రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా పలు అభిప్రాయాలు వ్యక్తంచేసింది.

వర్గీకరించే అధికారం

రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఆ ఫలాలు అందుకోలేని వారికోసం వాటిని వర్గీకరించే అధికారం కూడా ఉంటుందని జస్టిస్‌ అరుణ్‌మిశ్ర పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసమానతలు ఉన్నాయి. రిజర్వేషన్‌ ఫలాలు అట్టడుగువారికి చేరడం లేదు. అందువల్ల విభిన్న వర్గాల మధ్య ఉన్న తేడాలను సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాలను తీసేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలు తనకున్న అధికారాల పరిధికిలోబడి రిజర్వేషన్లను అందించడంతోపాటు, వాటిని సమానంగా పంపిణీ చేయొచ్చు. రిజర్వేషన్లను సమానంగా ఎలా అందించాలన్న విషయాన్ని రాష్ట్రాలే నిర్ణయించుకోగలవని మేం నమ్ముతున్నాం. అట్టడుగున ఉన్న వారిని పైకితేవడానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు హేతుబద్ధంగా నిర్ణయానికి రావాలి తప్పితే ఫలానా వారికి ఫలానా శాతమే రిజర్వేషన్లు కల్పించాలన్న నిబంధన ఏమీ లేదు. అది క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా ఉండాలి తప్పితే మొత్తం రిజర్వేషన్లు మాకే కావాలని ఎవ్వరూ అడగడానికి వీల్లేదు. అవసరాలకు తగ్గట్టు ఆ నిష్పత్తి ఉండాలి.

వాస్తవాలను విస్మరించి

న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పులపై మాకు పూర్తి గౌరవం ఉంది. అదే సమయంలో వాస్తవాలను విస్మరించి న్యాయస్థానాలు కళ్లు మూసుకుని గుడ్డిగా కూర్చోలేవు. మారుతున్న సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకపోతే రాజ్యాంగ లక్ష్యాలను సాధించలేం. అందువల్ల ఈవీ చిన్నయ్య కేసును పునఃసమీక్షించాలన్న త్రిసభ్య ధర్మాసనం తీర్పును విస్తృత ధర్మాసనం పునఃపరిశీలించాలన్న అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాం. ప్రస్తుతం ధర్మాసనంలో ఉన్న సంఖ్యాబలం అంతేస్థాయిలో ఉన్నందున మేం ఈవీ చిన్నయ్య కేసును పునఃపరిశీలించలేం. అందువల్ల ఆ అంశాన్ని ఏడుగురు అంతకంటే ఎక్కువమంది సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని ప్రధానన్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని జస్టిస్‌ అరుణ్‌మిశ్ర పేర్కొన్నారు.

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

  • ఇందిరా సాహ్ని కేసులో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను వర్గీకరించేందుకు అనుమతించారు. ఎస్సీ, ఎస్టీలు ఆర్టికల్‌ 16(4) కిందికి వస్తారు కాబట్టి ఆ వర్గీకరణ వీరికీ వర్తిసుంది.
  • జర్నయిల్‌ సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీలకూ క్రిమీలేయర్‌ వర్తింపజేయొచ్చని, అలా చేసినంత మాత్రాన అది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341, 342 కింద ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వులను మార్చినట్లుకాదని పేర్కొంది. కులాలు, వర్గాలు, ఉపవర్గాలన్నీ రాష్ట్రపతి జాబితాలో ఉన్నట్లుగానే ఉంటాయి. కానీ క్రిమీలేయర్‌ కిందికి వచ్చేవారినే రిజర్వేషన్‌ ఫలాలనుంచి మినహాయిస్తారు. అట్టడుగున ఉన్నవారికి రిజర్వేషన్‌ ఫలాలను అందించడం ఎలా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. తగిన ప్రాతినిధ్యం ఉన్న కులాలు, తరగతులే వీటిద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కులం, వృత్తి, పేదరికం పరస్పరం పెనవేసుకుపోయాయన్నది విస్పష్టం. అందువల్ల విభిన్న వర్గాల మధ్య వ్యత్యాసాలను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా సరిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే చర్యలను అడ్డుకోలేం.
  • సామాజిక మార్పునకు రాజ్యాంగం ప్రధాన ఆధారం. అసమానతలు తొలగించడం ప్రధాన ఉద్దేశం ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు తుడవడమే. రాజ్యాంగ లక్ష్యాలను అనుసరించి అసమానతలు తొలగించే సమయంలో సామాజిక వాస్తవాలను విస్మరించకూడదు. అసమానతలను రూపుమాపడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీలు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల్లో అసమానతలు ఎదుర్కొంటున్నవారు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఒకే సమూహజాతి కిందికి రారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. రిజర్వేషన్‌ ఫలాలను సరిగా అందుకోలేని అట్టడుగువర్గాల ఆకాంక్షలు ఇప్పటికీ కలగానే ఉన్నాయి. అదే సమయంలో వివిధ కులాలు ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి. వాళ్లు అసమానంగానే ఉన్నారు. అలాంటి వాళ్లు జీవితాంతం వెనుకబడే ఉండాలా?
  • పరిమితులకు లోబడి రిజర్వేషన్ల శాతాన్ని అమలుచేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఇతరులకు అన్యాయం చేయకుండా ఎస్సీ, ఎస్టీ, సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను హేతుబద్ధంగా వర్గీకరించేందుకు దానికున్న అధికారాన్ని రద్దుచేయకూడదు. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం అవసరమైన వారికి ప్రయోజనం కల్పించడమే. అందరికీ ప్రయోజనం కల్పించేలా వాటిని అమలుచేయలేకపోతే ఒకే సామాజిక వర్గంలో అసమానతలు శాశ్వతంగా ఉండిపోతాయి.

ఇది కోర్టు అభిప్రాయమే

ఈ తీర్పులో సుప్రీం ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా అవి తీర్పుకిందికి రావని, అభిప్రాయాలుగానే పరిగణించాలని న్యాయనిపుణులు పేర్కొన్నారు. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేపట్టలేవని ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనానికి ప్రతిపాదించినందున అది అమల్లో ఉన్నట్లేనని పేర్కొన్నారు. తదుపరి విస్తృతధర్మాసనం ఇచ్చే తీర్పుపై రిజర్వేషన్ల వర్గీకరణ ఆధారపడి ఉంటుందన్నారు.

తీర్పును స్వాగతిస్తున్నాం

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ తీర్పు రిజర్వేషన్లు పొందలేకపోయిన షెడ్యూలు కులాల్లోని వేలాది ఉపకులాల ప్రజలకు ఊరట కలిగించిందన్నారు. సామాజిక న్యాయానికి, సమాన పంపిణీకి, సమానత్వ సాధన, రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం తీర్పు నిలువెత్తు నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో 1500 కోట్లు స్వాహా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.