రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలోని ప్రార్థనాలయాల పునరుద్ధరణ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ సుప్రీంకోర్టు సూచనతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
సచివాలయ భవనం కూల్చివేత సమయంలో రెండు మసీదులు, ఒక దేవాలయం దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరించాలని ఐజాజుద్దీన్ పిటిషన్ వేశారు. ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్‌ను విచారణ చేయలేమని.. పిటిషనర్ మందిరం, మసీదులను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారని తప్పుగా గ్రహించారని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం సూచించింది.
ఇదీ చూడండి : రాజ్‌భవన్‌లోని వినాయకుని నిమజ్జనం