ETV Bharat / state

సుప్రీంలో విద్యుత్ ఉద్యోగులకు చుక్కెదురు - విద్యుత్​ ఉద్యోగుల కేసులపై సుప్రీం తీర్పు

జస్టిస్ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాల విషయంలో విద్యుత్ ఉద్యోగులకు సుప్రీంలో చుక్కెదురైంది. కేటాయింపుల విషయంలో సవాలు చేయలేరని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు
author img

By

Published : Jul 15, 2019, 3:12 PM IST

తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపులపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కంలు, ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం... జస్టిస్ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాలపై సవాలు చేయలేరని.. కావాలంటే ఉద్యోగుల తుది కేటాయింపులను సవాలు చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది.

విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై ఏర్పాటైన జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇచ్చింది. విభజన సమస్య కేవలం 1157 మంది ఉద్యోగుల విషయంలో ఉంటే మొత్తం 10 వేల 400 మంది ఉద్యోగులకు ఆప్షన్లను ఇవ్వడాన్ని తెలంగాణ విద్యుత్ కార్పొరేషన్లు, డిస్కంల ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. కమిటీ మార్గదర్శకాలతో విద్యుత్ ఉద్యోగుల విభజన మరింత సంక్లిష్టమైందని కోర్టులో పిటిషన్ వేశారు.

ఇదీ చూడండి : భాజపా నేత మురళీధర్​రావుపై హైకోర్టులో పిటిషన్​

Intro:ప్రతి నీటి బొట్టును ఉపయోగపడేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు

Body:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి అంటూ మొక్కలు నాటాలని అని ప్లే కార్డ్స్ తో ర్యాలీ నిర్వహించారు. చేవెల్ల సర్పంచ్ శైలజ ఆగి రెడ్డి గ్రామంలో ఇంకుడు గుంతల తవ్వకాలను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు బాగా కురవాలంటే చెట్లు నాటాలని తెలిపారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి ఫోన్ నెంబర్ ర్ 9866815234
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.