ETV Bharat / state

విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు విచారణ - విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ డిస్కంలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం  డిస్కంల అభ్యంతరాలను పరిశీలించాలని జస్టిస్‌ ధర్మాధికారి కమిటీకి సూచించింది. తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Supreme Court hearing on the division of power employees
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు విచారణ
author img

By

Published : Jan 24, 2020, 1:27 PM IST

తెలుగు రాష్ట్రాల విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ ధర్మాధికారి నివేదికను సవాలు చేస్తూ ఏపీ డిస్కంలు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం డిస్కంల అభ్యంతరాలను పరిశీలించాలని జస్టిస్‌ ధర్మాధికారి కమిటీకి సూచించింది.

2 వారాల్లోగా తమ అభ్యంతరాలను కమిటీ ముందుకు తీసుకెళ్లాలని డిస్కంలను ఆదేశించింది. కమిటీ కేటాయింపులు పక్కన పెట్టాలన్న ఏపీ డిస్కంల వాదనలను తోసిపుచ్చింది. విభజన చట్టం ప్రకారం 52:48 నిష్పత్తిలో ఉద్యోగులను విభజించాలని ఏపీ డిస్కంలు వాదించాయి. 655 మంది ఉద్యోగులను కేటాయించడం ఆమోదయోగ్యం కాదన్న ఏపీ డిస్కంలు... తమపై భారం పడుతోందని వాదించాయి. తాము ఆరేళ్లుగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చామని తెలంగాణ తరఫు న్యాయవాది తెలిపారు. జీతాలు ఎవరు అందచేయాలనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది.

ఇదీ చూడండి: వెలుగు జిలుగుల మేడారానికి విద్యుత్​ శాఖ కసరత్తు

Intro:Body:

court

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.