Telugu Academy: తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన 92.94 కోట్ల రూపాయలు.. 6 శాతం వడ్డీతో వారంలో చెల్లించాలని ఆదేశించింది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల సమయమిచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లీ ధర్మాసనం.. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: