ETV Bharat / state

అమరావతి భూముల కేసులో స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ - Latest news of Amravathi lands

ఏపీ రాజధాని అమరావతి భూముల అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. అవకతవకలు జరిగాయని కమిటీ భావించిన అంశాలపైనే సిట్‌ ఏర్పాటు చేసినట్లు దుష్యంత్‌ దవే కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సహా డీజీపీ, సిట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Delhi_Supreme court on Capital petetioners
అమరావతి భూముల కేసులో స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ
author img

By

Published : Nov 5, 2020, 4:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అమరావతి భూముల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలన్న ఆ రాష్ట్రప్రభుత్వ పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్టే ఎత్తివేతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. గతంలో అమరావతి భూముల అంశంపై ఏర్పాటైన సిట్.. మంత్రివర్గ ఉపసంఘంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్​ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతత్వంలోని ధర్మాసనం విచారించింది.

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడం సరికాదని దుష్యంత్ దవే అన్నారు. గత ప్రభుత్వ అన్ని చర్యలపై దర్యాప్తునకు కమిటీ వేశారా అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ప్రశ్నించారు. అవకతవకలు జరిగాయని కమిటీ భావించిన అంశాలపైనే సిట్‌ వేశారని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. రాజధాని భూముల అంశంలో సీబీఐ దర్యాప్తునకు కేంద్రానికి లేఖ రాశారని దుష్యంత్ దవే వెల్లడించారు. లేఖకు కేంద్రం నుంచి సమాధానం వచ్చిందా అని ధర్మాసనం అడిగింది. కేంద్రం నుంచి ఇంతవరకు సమాధానం రాలేదని న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు.

స్టే ఎత్తివేయాలన్న ప్రభుత్వ వాదనపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ సహా డీజీపీ, సిట్‌కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.