హీరాగోల్డ్ కేసులో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి చెల్లిస్తామని నౌహీరా తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. హీరా గోల్డ్ నిర్వాహకురాలు నౌహీరా షేక్... కేసుపై సుప్రీంలో విచారణ జరిగింది. తీవ్ర నేర పరిశోధన ఆఫీస్, ఐపీసీ ప్రకారం విచారణ జరపాలన్న తెలంగాణ అభ్యర్థనతో పాటు బెయిల్ మంజూరు చేయాలని నౌహీరా షేక్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రెండు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ ధర్మాసనం విచారణ జరిపింది. బెయిల్ మంజూరు చేయాలని నౌహీరా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగి చెల్లిస్తామని సుప్రీంకోర్టుకు తెలపారు. నోటిమాటగా చెబితే ఎలా అని ప్రశ్నించిన ధర్మాసనం.. సొమ్ము ఎలా చెల్లిస్తారో నివేదిక తయారుచేసి నివేదించాలని ఆదేశించింది. చెల్లింపులపై 10 రోజుల్లో నివేదిక సమర్పించాలని నౌహీరాను ఆదేశించిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.